శనివారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి సమీపంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో గౌరవ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. తిమ్మాయిపల్లి నుంచి కీసర వైపు వెళ్తున్న గౌరవ్ కారును, ఎదురుగా నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. గాయపడిన గౌరవ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతి చెందాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.