పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పోతుకూచి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో 108 మంది మహిళలు స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తి కీర్తనలు ఆలపించారు. భక్తులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా ఆశీస్సులు పొందారు.