గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఖమ్మంరూరల్ ACP తిరుపతి తెలిపారు. చేగొమ్మ X రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కూసుమంచి వైపు నుంచి కారులో అనుమానాస్పదంగా వస్తున్న వారిని తనిఖీ చేయగా రూ.89 లక్షల విలువ గల 179 KGల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి.. నిందితులు పల్లపు రఘు, మహమ్మద్ ఖాజా పాషాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.