విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంచినీళ్లు కాలుష్యం వల్ల ఓ మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం. గత రాత్రి నుండి వాంతులు విరోచనాలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామని డాక్టర్లు వాటర్ కాలుష్యం వల్ల చనిపోయినట్లు నిర్ధారించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.