నారాయణపేట నియోజకవర్గం లోని రైతులు ఎవరు కూడా యూరియా గురించి ఆందోళన చెందవద్దని సరిపడా యూరియా అందుబాటులోకి వస్తుందని పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ లో ఒంటిగంట సమయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వానాకాలంలో 4039 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఇదివరకు 5000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వరి సాగు పెరిగిందని అన్నారు. అందుకు తగ్గట్టుగానే యూరియా పంపిణి చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు యూరియా లభిస్తుందని అన్నారు