మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో పాటుగా పలువురు జిల్లా అధికారులు పాల్గొని,కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషి, అయన రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింభించాయని తెలిపారు. తెలుగు భాషా మాధుర్యం, సంపద, సంస్కృతి కలిగిన భాష అని కలెక్టర్ సత్యప్రసాద్ గుర్తు చేశారు.