కేంద్ర ప్రభుత్వం 56వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా నిర్మాణరంగం పుంజుకోవడానికి అవకాశం ఉందని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి. సురేష్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో గతంలో వినియోగదారులు ఎంతో నష్టపోయేవారన్నారు. ప్రస్తుతం జీఎస్టీ తగ్గించడం వల్ల వివిధ రకాల వస్తువుల సేవలు వినియోగదారులకు మేలు చేకూరుతుందన్నారు.