ప్రజా ఆరోగ్య పై అధికారులు దృష్టిపెట్టాలని పాఠశాలల్లో వసతిగృహాల్లో విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు ఈరోజు గూడూరు మండల లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మండల ప్రాథమిక పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చే పేషెంట్లకు సరిపడా మందులు ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సీజనల్ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని అన్నారు.