నారాయణపేట జిల్లాలో డీజే లకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతుల్లో పండగలు జరుపుకోవాలని సోమవారం 3 గం సమయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పేట జిల్లా పరిధిలో డీజే లు నిషేధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. డీజే వలన శబ్ద కాలుష్యం పెరిగి చిన్న పిల్లలు విద్యార్థులు వృద్దులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నందున డీజే సంస్కృతి యువతలో తప్పుదారి పట్టించే పరిస్థితులను సృష్టిస్తుందని అందువల్ల డీజే ల వినియోగాన్ని పూర్తిగా జిల్లాలో నిషేధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.