ఖమ్మం జిల్లా వైరా కొనిజర్ల మండలాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా మోస్తరుగా భారీ వర్షం కురిసింది భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు వైరా మున్సిపాలిటీలోని 12 13 వార్డు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణపతి విగ్రహ మండపాలలో పూజలు చేసుకునేందుకు భక్తులు ఇబ్బందులు గురయ్యారు వర్షం కారణంగా వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం దాటి 5 పలుగులపై వరద నీరు ప్రవహిస్తుంది వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 19 అడుగుల చేరింది