అశ్లీలతపై సెన్సార్ విధించాలని ఐద్వా నేత నిర్మల డిమాండ్ చేశారు. బుధవారం కల్లూరు మండలం పెద్దపాడు డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన మహిళల జనరల్ బాడీ సమావేశంలో ఐద్వా రాష్ట్ర నాయకులు పీ.నిర్మల మాట్లాడారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే అశ్లీలతను ఇంటర్నెట్‌లో పూర్తిగా సెన్సార్ చేయాలని, మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐద్వా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.