జిల్లాలో యూరియా కొరత లేదని అక్టోబర్ వరకు రైతుల అవసరాలు తీర్చేందుకు సరిపడా యూరియా సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. ఆదివారం కొవ్వూరులో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారని స్పష్టం చేశారు .రైతుల సమస్యలు 8977935611 నెంబర్ కు తెలియ చెయండి కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత , రైతాంగం పాల్గొన్నారు.