ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఓ రైతు కూలీ అకస్మాత్తుగా పడి మృత్యుంజయుడుగా బయటకు వచ్చిన ఘటన ఖానాపూర్ మండలం బాదనకుర్తిలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానికుల వివరాల ప్రకారం కడెం మండలం ధర్మాజీపేట్ కు చెందిన మల్లయ్య అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ బాధనకుర్తిలో ఉంటున్న నేపథ్యంలో గోదావరి నదిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఒడ్డుకు రావాలని కేకలు వేయగా కొంత దూరం వరకు ఈదుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేరుకున్నాడు. ఘటన స్థలాన్ని సిఐ అజయ్,ఎస్సై రాహుల్ పోలీసులు పరిశీలించారు.