దివంగత నేత వైయస్సార్ పేద ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్లో వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేద ప్రజల వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎందరో ప్రాణాలు కాపాడిన ఘనత వైయస్సార్ కు దక్కుతుందన్నారు. డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మండల అధ్యక్షులు తాహిర్ అలీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.