సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక వ్యాపారస్తులు మార్వాడి గో బ్యాక్ అంటూ శుక్రవారం స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ర్యాలీ చేపట్టారు. మార్వాడి ఉద్యమ జేఏసీ నాయకులు స్వర్గం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మార్వాడిలా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని దాడులు చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.