పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గాననాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. మండపాలకు వచ్చిన ఆయనను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేసారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ. గత రెండు నెలల క్రితమే యూరియా అవసరాలపై సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారని గుర్తు చేసారు. అయనప్పటికీ తెలంగాణా ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.