బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ గురువారం రాబడిన సమాచారంతో ఇచ్చర్ వాహనం,407 వాహనాల్లో 345బస్తాలు సుమారు14 టన్నుల రేషన్ బియ్యం ను రెండు వాహనాల డ్రైవర్ లు గంగవరంకి చెందిన బానుమూర్తి,పలమనేరు గంటావూరుకు చెందిన రోషన్ అనే వాళ్ళు తిరుపతి నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుంటే బంగారుపాళ్యం పోలీసులు రెవిన్యూ సిబ్బంది దాడి చేసి పట్టుకోవడం జరిగింది.బియ్యం విలువ 1లక్ష 28వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.వాహనాలు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.