వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా నియమితులైన రమేష్ సాహు శనివారం సాయంత్రం నగరంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా విభాగం వెన్నెముక వంటిదని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు పడినా, మరెన్ని కేసులు పెట్టినా, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న నిజమైన జగనన్న వారియర్స్ సోషల్ మీడియా సైన్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిందని లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు.