రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు కేవలం ఫీజు రీయంబర్స్మెంట్ మీద ఆధారపడి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 కు భీమవరంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. సకాలంలో రీయంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడం విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.