లారీ ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.రాఘవ రెడ్డి ఆదివారం తెలిపారు.గుర్రంకొండ మండలం గుర్రంకొండ పట్టణంలోని టమోటా మార్కెట్ వద్ద బాబ్జాన్ తన 14చక్రాల లారీని ఎప్పటిలాగే నిలిపి ఉంచాడు.ఈ నెల 18న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి తీసుకెళ్లారు. మరుసటి రోజు తన లారీ మార్కెట్ వద్ద కనిపించక పోవడంతో బాబ్జాన్ పోలీసులకు పిర్యాదు చేశాడు.సీఐ రాఘవ రెడ్డి, ఎస్ఐ రఘురాంతో కలిసి టెక్నాలజీ సహాయంతో పీలేరు కలకడ మార్గంలోని దుర్గం వారి పల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.