ఐదు రూపాయలకే సామాన్యుడికి భోజనం అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ ద్వారా సామాన్యులకు ఎంతో దోహదంగా నిలుస్తుంది అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపాలపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం అందిస్తామని ప్రకటించారు.