తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను త్వరలో పునరుద్ధరించాలి : రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట, పుల్లంపేట,పెనగలూరు, నందలూరు మండలాల్లో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దచాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మెడికల్ వెరిఫికేషన్ లో అనేక మంది దివ్యాంగులకు అన్యాయం జరిగిందని,పెన్షన్ రద్దు అయిందని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ని వెనక్కి తీసుకోవాలని