కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా అనంతపురం పట్టణంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఘనంగా మోర్నింగ్ వాక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ అనంతపురం టౌన్ క్లాక్ టవర్ వద్ద ర్యాలీని ప్రారంభించి, ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, ప్రజాసేవా తపనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మాధ్యమ తరగతి, వ్యాపార వర్గాలు, చిన్న వ్యాపారులు మరియు వినియోగదారులందరికీ ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.