పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఎస్.కొండేపాడు గ్రామ వీఆర్వో అడబాల కనకదుర్గా ప్రసాద్ మృతి చెందారు. పిప్పర వద్ద శుక్రవారం ఉదయం 10గంటలకు బైక్ పై వెళ్తున్న దుర్గా ప్రసాద్ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గణపవరం ఎస్ఐ ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు వీఆర్వో దుర్గాప్రసాద్ స్వస్థలం వీరేశ్వరపురం గ్రామం