Download Now Banner

This browser does not support the video element.

అన్నమయ్య జిల్లాలో బార్ల కేటాయింపుకు రేపు లాటరీ

Rayachoti, Annamayya | Aug 29, 2025
అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయబోయే కొత్త బార్ల కేటాయింపుకు రేపు లాటరీ డ్రా నిర్వహించనున్నారు. మొత్తం 11 ఓపెన్ బార్లకు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.మదనపల్లిలో 3, రాయచోటిలో 2, రాజంపేటలో 2 బార్లకు దరఖాస్తులు సమర్పించబడ్డాయి. అదనంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన ఒక బార్‌కు కూడా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.ఈ బార్ల కేటాయింపు కోసం ఆగస్టు 30వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో, రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్‌లో లాటరీ డ్రా జరుగనుంది.దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలి
Read More News
T & CPrivacy PolicyContact Us