కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో బుధవారం ఓ పోలీస్ అధికారి అమ్మవారి గర్భగుడి సమీపంలో పాదరక్షకులు ధరించి విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అక్కడే ఉన్న భక్తులు నివ్వెరపోయారు. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.