కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ లోని ప్రభుత్వ ఆసుపత్రి, అన్న క్యాంటీన్ లను శుక్రవారం అధికారులతో కలిసి టిడిపి ఇన్చార్జ్ రితేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్బంగా అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్న ప్రజలను, ఆహార పదార్థాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులతో మాట్లాడి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి ప్రజల మన్ననలను పొందాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.