శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశిబుగ్గ పోలీసులు బుధవారం సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగులను పరిశీలించగా.. వారి వద్ద సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కాశీబుగ్గ డి.ఎస్.పి వెంకట అప్పారావు మీడియాతో తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి కేరళ అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పలాసలో వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.