కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని , రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో మజార్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అక్బర్ సహకారంతో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆదివారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆవిష్కరించారు, విగ్రహావిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కాంగ్రెస్ నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు