మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యాలయంలో ఆదివారం జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాత పోరు పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపా లక్ష్మీ మాట్లాడుతూ రైతులకు అండగా వైసీపీ పార్టీ ఉంటుందని, యూరియా కొరత, రైతులు పడుతున్న కష్టాలపై పోరాడేందుకు ఈనెల 9వ తేదీన చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.