కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని చెప్పిన అబద్ధపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని CITU రాష్ట్ర కోశాధికారి రాములు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆశా వర్కర్ల ధర్నాకు ఆయన మద్దతు తెలుపుతూ మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అణుగుణంగా వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.