కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం ఉదయం నుంచి ఉవ్వెత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. వాహనాలు జారిపడి పలువురికి గాయాలయ్యాయి. పాఠశాల బస్సులలో వెళుతున్న విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం కంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.