నవరాత్రులు, దీపావళి, ఛఠ్ పూజల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోందని విశాఖ రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. హైదరాబాద్ - భువనేశ్వర్ ప్రత్యేక రైలు రైలు నెం. 07165 హైదరాబాద్ - భువనేశ్వర్ రైలు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు 15 నిమషాలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.