ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నటించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ సినిమాను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తదితరులతో నారాయణ మూర్తి కలసి చూశారు. గురువారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని లక్ష్మీ థియేటర్లో ప్రదర్శితమవుతున్న యూనివర్సిటీ సినిమాను ఫస్ట్ షోను వారు చూశారు. సినిమా థియేటర్ కు ఆర్ నారాయణ మూర్తి వచ్చారన్న విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను కలిసేందుకు ఉత్సాహం కనబరిచారు.