అల్లూరి జిల్లా పాడేరు అటవీ శాఖ కార్యాలయం వద్ద మాడగడ వ్యూ పాయింట్ చిరు వ్యాపారులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాడేరు ఐటీడీఏ వద్దకు చేరుకున్న వారంతా నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి నుండి ఫారెస్ట్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు తమ సమస్యను పరిష్కరించే వరకు అక్కడ నుంచి వెళ్లేది లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకో టూరిజం పేరిట అధికారులు తమను వేధిస్తున్నారని దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే మాడగడ వ్యూ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని పర్యటకులను అడ్డుకుంటామంటే హెచ్చరించారు.