Download Now Banner

This browser does not support the video element.

కలర్ షైన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. యువకుడు మృతి , ఐదు మంది కి తీవ్రగాయాలు

Gudur, Tirupati | Sep 13, 2025
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆదిత్య (25 ) అనే వ్యక్తి మృతి చెందగా , మరో ఐదు మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. జర్నలిస్టులకి లోపలకి వెళ్లనీయకుండా యాజమాన్యం, సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడడంతో గేటు వద్ద ధర్నాకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా న నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని యాజమాన్యంతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us