వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కోనా కార్పస్ చెట్లను గురువారం ఉదయం 11 గంటలకు అధికారులు తొలగించారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ లో సుమారు కిలోమీటర్ మేర ఉన్న చెట్లను అధికారులు తొలగించారు . పర్యావరణానికి ఈ చెట్ల వల్ల ముప్పు పొంచి ఉన్నాదన్న కారణంతో తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి సాయిలు వెల్లడించారు.