అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బేక్కెసుల శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే సన్న బియ్యం పథకం రాష్ట్రంలో ప్రారంభమైనదని అన్నారు.