అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన కాయల చిన్న పెద్దప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈనెల 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతనిని గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.