పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల డ్యూటీ కోసం వాహనాలు కావాలని షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రం ఫరూక్ నగర్ తహసిల్దార్ కార్యాలయం నుండి పిలుపు అందుకున్న పలువురు టాక్సీ డ్రైవర్లు బుధవారం ఉదయం నుండి సాయంత్రం దాకా విధుల కోసం వేచి చూశారు. చివరాఖరికి వాహనాలు అవసరం లేదని వెళ్ళిపోవాలని చెప్పడంతో టాక్సీ డ్రైవర్లు ఎదురు తిరిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆ కార్యాలయం ముందు టాక్సీ డ్రైవర్ల ఆందోళన ధర్నా చేపట్టారు.