ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా పోలింగ్ రోజు పోలింగ్కు ఒక రోజు ముందు అనగా మే నెల 12 13వ తేదీలో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురించకూడదని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక తెలిపారు వివిధ రాజకీయ పక్షాలు అభ్యర్థులు ఇతరులు ఎవరైనా సరే ముందుగా ఎం సి ఎం సి ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.