ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్-బాబాపూర్ మధ్య రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే ముందుకొచ్చారు. సొంత డబ్బుతో రోడ్డు గుంతలను పూడ్చి రాకపోకలకు వీలు కల్పించుకున్నారు. రోడ్డు వేసేందుకు అధికారులు వస్తారని ఎదురు చూసి, చివరికి ఓపిక లేక వారే రోడ్డేసుకున్నారు.