కోరుకొండలోని గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. తనిఖీ సమయంలో ఎరువులు పంపిణీ జాబితాను పరిశీలించి, రెండు బస్తాలు ఇచ్చే చోట ఒక రైతుకి ఐదు బస్తాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఏ ఆధారంపై ఇంత మోతాదు కేటాయించారని మండిపడ్డారు.