పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని, బెల్లంపూడి సెంటర్‌లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు.