తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ వర్కర్లు గురువారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో అంగనవాడి యూనియన్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అంగన్