సాగర తీరం అందాలను డబుల్ డెక్కర్ బస్సుల్లో అద్దాల మధ్యలో నుంచి చూస్తుంటే ఆ కిక్కే వేరప్పా అనేలా ఉంటుంది. అలల సవ్వడులు, ఎగిసిపడే కెరటాలు, చల్లని గాలులు... ఇవన్నీ అనుభవించాలంటే కారులోనో, బైకులోనో వెళ్లడం కన్నా డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. విశాఖ వాసులకు ఆ ముచ్చట శుక్రవారం నుంచి తీరనుంది. విశాఖలోని ఏపీఎస్‌ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను పరిచయం చేసింది. ఇవి నగరంలో ఉన్నవారికి, పర్యాటకులకు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ బస్సులు రుషికొండ, భీమిలి, సాగర తీరం, యారాడ బీచ్ వంటి ప్రాంతాలకు వెళ్తూ అద్భుతమైన దృశ్యాలను చూపిస్తాయి.