ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓట్లను చోరీ చేసి గద్దెనెక్కిందని వెంటనే గద్దె దిగాలని అన్నారు అంతేకాకుండా ఓట్ల లిస్టులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీజే ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.