వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతి గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు భారీగా తరలివచ్చి ప్రజా పవన్ వద్ద వేడుక చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తో పాటు జిల్లాలోని పలువురు అధికారులు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.