సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు AAA సినిమాస్ సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని ఇన్‌ఆర్బిట్ మాల్‌లో శుక్రవారం మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త మల్టీప్లెక్స్‌లో ఎనిమిది అత్యాధునిక స్క్రీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాలమైన సీటింగ్, అత్యాధునిక ఆడియో, వీడియో సాంకేతికతతో కూడిన ఈ మల్టీప్లెక్స్ నగరంలోని సినీ ప్రియులకు ప్రీమియం సినిమా అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఏఏఏ సినిమాస్ రాకతో విశాఖపట్నంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.