ములుగు జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కు నేడు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో యురియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత మూడు నెలల నుండి రైతులకు యూరియా బస్తాలు దొరకడం లేదని అన్నారు. రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.